UPA, NDA ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా.. – సీఎం రేవంత్​ కు కిషన్ ​రెడ్డి సవాల్

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 2004 నుంచి 2014 వరకు యుపీఏ హయాంలో, 2014 నుంచి 2024 వరకు ఎన్డీఏ హాయాంలో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్‌ హయాంలో చేసిన ఘనతలు, విజయాలు, సానుకూల ఫలితాలతో పాటు 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ పాలన వైఫల్యాలను, ప్రతికూలాంశాలను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా విమర్శించవచ్చు కానీ అబద్ధాలను ఆశ్రయించడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. పదేళ్లలో మోదీ తెలంగాణకు ఇచ్చిన నిధులపై సీఎం చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.

 

 నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందంటూ వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరం. మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు రూ.9 లక్షల కోట్లకుపైగా నిధులను ఇచ్చింది. 2014 – 24 కాలంలో మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందనే అంశంపై నేను చర్చకు వస్తాను. 2004-2014 కాలంలో యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రపద్రేశ్‌లోని తెలంగాణ ప్రాంతానికి ఏమిచ్చిందనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు రావాలి. కొడంగల్, అమవీరుల స్థూపమా, తేదీ మీరే నిర్ణయించండి. వాస్తవాలతో అర్థవంతమైన చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం అని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news