నిరుద్యోగ యువకులు గత వారం రోజులుగా అశోక్ నగర్ లో నిరసన కార్యక్రమాలు చేపడితే సీఎం మాటలు చేతలు దాటుతున్నాయే తప్ప సచివాలయం గేటు దాటటడం లేదు. నిరుద్యోగ, రైతాంగ, పేదలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు, ఎన్నికలలో హామీలు ఏ ఒక్కటి సచివాలయం గేటు దాటడం లేదు అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. దేవాలయంలో రక్తాభిషేకం చేస్తారా? నిరసనాకారులు టెర్రరిస్టులా?.. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి హిందూ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారు అని తెలిపారు.
అలాగే వినాయక చవితి, బోనాలు, దేవీ నవరాత్రుల సందర్భంగా అనేకమందిపై కేసులు పెట్టించారు. అన్యమతస్థులకు సంబంధించిన ప్రార్థన కేంద్రాల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వస్తున్న శబ్దాలు పోలీసులకు, ముఖ్యమంత్రికి వినబడవా? కనబడవా? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అక్కడ మతపరమైన శిక్షణ పొంది హిందూ దేవాలయంపై ఒక వ్యక్తి దాడి చేస్తే ఎందుకు సీఎం, కాంగ్రెస్ పార్టీ ఖండించలేదు. అయోధ్యలో రామాలయ నిర్మాణం, అమ్మవారిని కొలిస్తే, హిందూ దేవుళ్ల పండుగలు దేవున్ని కొలిస్తే రాహుల్ గాంధీకి ఎందుకు బాధ వేస్తుంది. ముత్యాలమ్మ నిరసనకారులపై ఎందుకంత పాశవికంగా దాడి చేయాల్సిన అవసరం ఏర్పడింది. దేవాలయ ధ్వంసం వంటి వీడియోలు చూసిన ఏ హిందువుకైనా ఆగ్రహం రాకుండా, ఆక్రోశం రాకుండాఉంటుందా అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి.