షేక్‌పేట్‌లోని బూత్ నెంబరు15లో కొత్త ఓటరు జాబితాలో పలు ఓట్ల గల్లంతుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌తో మాట్లాడి ఫిర్యాదు చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి…నగరంలోని పలు ప్రాంతాల్లో పోల్ స్లిప్స్ చిన్న ప్రింటర్లను పోలీసులు సీజ్ చేయడంపై మండిపడ్డారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు కిషన్ రెడ్డి.
డీసీపీతో మాట్లాడి ఆ ప్రింటింగ్ మిషన్లను తిరిగి పోలింగ్ కేంద్రాలకు చేరేలా చొరవతీసుకున్నారు కిషన్ రెడ్డి. ఇక అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై సీఈఓ వికాస్ రాజ్ కు ఫిర్యాధు చేసింది కాంగ్రెస్. ఓటు వేసి మీడియాతో మాట్లాడుతూ మోడీ పేరును ప్రస్తావించినందుకు ఫిర్యాదు చేసింది.
పోలింగ్ రోజు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందంది కాంగ్రెస్ వెల్లడించింది. కిషన్ రెడ్డి పై కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేయాలని EC ని కోరంది కాంగ్రెస్ పార్టీ.