మిలటరీ ఉందని పట్టుకుపోతారా.. కెసిఆర్ ను ముట్టుకుంటే కాలి పోతారు : జగదీశ్ రెడ్డి

-

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి పై తెలంగాణ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. కిష‌న్ రెడ్డి సొంతూరుకు పోయినా కేసీఆర్ పాల‌న‌, బీజేపీ చేసిన న‌ష్టంపైనే ప్ర‌జ‌లు చెబుతారని చురకలు అంటించారు. కిష‌న్ రెడ్డి చ‌ర్చ‌ల కోసం కేసీఆర్ కావాలా? కేసీఆర్‌ను ముట్టుకుంటే కాలిపోతారని హెచ్చరించారు. మిల‌ట‌రీ ఉంద‌ని కేసీఆర్‌ను ప‌ట్టుకుపోతారా? అని మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి మండిపడ్డారు.

కిషన్ రెడ్డికి బండి సంజయ్ కు మాట్లాడే దమ్ము లేదని జగదీశ్ రెడ్డి అగ్రహించారు. బండి సంజయ్ ,కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని.. బండి సంజయ్ ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కు తెలియదు అనుకుంటే మరి కిషన్ రెడ్డి అబద్ధాలు ఎందుకు మాట్లాడ్తున్నారని ఫైర్ అయ్యారు.

దొడ్డిదారిన కేంద్రం విద్యుత్ డ్రాఫ్ట్ పాలసీ ప్రకటించి …అమలు చేస్తుందన్నారు. ఆ డ్రాఫ్ట్ లో వ్యవసాయముకు మీటర్లు పెట్టాలని ఉందని వెల్లడించారు. మొత్తం మీటర్లు పెడితే 25 మార్కులు అని నేషనల్ డ్రాఫ్ట్ పాలసిలో ఉందని.. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నయ్యని …దొడ్డిదారిన అమలు చేస్తుందని కేంద్రంపై ఫైర్ అయ్యారు. ఇంత చేస్తూ బిజెపి నేతలు ఎందుకు బుకాయిస్తున్నారని అగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version