BREAKING : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ పేరును ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. కాసేపటి క్రితమే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది.
ఈ తరుణంలోనే సభలో ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ పేరును ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అటు చర్చను మొదలు పెట్టిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి..కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌన్సిల్ లో మాట్లాడారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై వెంటనే దృష్టి పెట్టాలి.. కృష్ణా నీటిని అక్రమంగా తరలిస్తున్నా.. చూస్తూ కూర్చుంటే ఎలా..అని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. గత ప్రభుత్వం కృష్ణా జలాల్లో మన హక్కులను పరిరక్షించలేదు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లేఖలకే పరిమితం అయిందని ఆగ్రహించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.