కీలక ప్రకటన చేసిన కేంద్రం… సామాన్యులు, మధ్య తరగతికి శుభవార్త..!

-

పేద, మధ్య తరగతి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల్ని తీసుకు వచ్చింది. తాజాగా వాళ్లకి అదిరిపోయే శుభవార్త చెప్పింది. పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేసింది. వివరాల లోకి వెళితే.. సామాన్యుల సొంతింటి కల నెరవేరేందుకు ఆర్థిక సాయం ఇవ్వడానికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ని పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది డిసెంబర్ 31, 2024 వరకు అందుబాటులో ఉండనుంది.

దీనితో సామాన్య ప్రజలకు ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. 2022, మార్చి 31తోనే ముగియాల్సి వుంది ఇది. కానీ ఇప్పటికే పలు సారి ఎక్స్టెండ్ చేసింది. తాజాగా మళ్ళీ పొడిగించినట్లు తెలిపింది. డిసెంబర్, 2022 నాటికి ఈ స్కీమ్ ద్వారా 120.45 లక్షల ఇళ్లను మంజూరు చేసింది కేంద్రం. మంజూరు చేసిన ఇళ్లలో 107.3 లక్షల ఇళ్లు అనగా దాదాపు 89 శాతం ఇళ్ల పనులు ప్రారంభమైనట్లు వెల్లడించారు.

అలానే 67.1 లక్షల ఇళ్లు పూర్తయి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. జులై 24, 2023 నాటి వివరాలు చూస్తే.. 112.25 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం అయ్యాయని అన్నారు. వీటిల్లో 75.51 లక్షల ఇళ్లు పూర్తయి లబ్ధిదారులకు ఇచ్చేశారట. ఏపీ రాష్ట్రానికి ఈ స్కీమ్ కింద 21.32 లక్షల ఇళ్లు మంజూరు చేశారట.

Read more RELATED
Recommended to you

Latest news