అరికేపూడి గాంధీ మా పార్టీ సభ్యుడు అయితే..దమ్ముంటే తెలంగాణ భవన్ కు రావాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికలు వస్తాయని తెలిసి పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారని.. పూటకో పార్టీ మారే దానం నాగేందర్ బిచ్చగాడని ఆగ్రహించారు. దానం నాగేందర్ ఓ చీటర్… దానం నాగేందర్ శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోతాడని హెచ్చరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు,శరం లేదా…? రాజీనామా చేయండని మండిపడ్డారు.
కడియం శ్రీహరి పచ్చి మోసగాడు… పొద్దున కేసీఆర్ దగ్గర బ్యాగులు తీసుకుని వెళ్లి…. సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరాడని ఆరోపణలు చేశారు. కడియం శ్రీహరి స్టేషన్ ఘన్ పూర్ లో డిపాజిట్ తెచ్చుకోవాలన్నారు. అరికేపూడి గాంధీ… నేను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదు అంటున్నారని ఆగ్రహించారు. నేను దేవుడు కండువా కప్పుకున్నానని అంటున్నారన్నారు. కాంగ్రెస్ లో చేరానని గాంధి యే స్వయంగా మీడియా కు చెప్పి ఇపుడు మాట మారుస్తున్నారని నిప్పులు చెరిగారు. పార్టీ మారిన వారు హై కోర్టు తీర్పు తర్వాత గజగజ వణుకుతున్నారని… స్పీకర్ నిర్ణయం దాకా ఆగకుండా పిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలను ఎదుర్కోవాలన్నారు. ఎపుడు ఎన్నికలు వచ్చినా ఆ పది సీట్లు బీఆర్‌ఎస్ ఏ గెలుస్తుందని తెలిపారు.