ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇంటి ముందు సిక్కు సంఘాల ఆందోళన చేపట్టాయి. అమెరికా పర్యటనలో సిక్కుల భద్రత పై మాట్లాడారు రాహుల్ గాంధీ. భారత్ లో సిక్కులకు భద్రత లేదన్న రాహుల్ గాంధీ. సిక్కులు తలపాగా ధరించాలన్నా భయపడుతున్నారన్న రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సిక్కు సంఘాలు తప్పుపట్టాయి. సిక్కులను అవమానించేలా మాట్లాడితే సహించేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని సిక్కు సంఘాల డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు రిజర్వేషన్ల పై కూడా రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారని నిన్న మాయావతి ఆరోపించారు. ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా రాహుల్ గాంధీ పై విమర్శించారు. రాహుల్ గాంధీ ఎందుకు ఇలా చేస్తున్నారని పలువురు చర్చించుకోవడం గమనార్హం.