తెలంగాణకు మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మొన్న సాయంత్రం వాయువ్య బంగాళాఖాతంలోని ఒడిస్సా తీరంలో ఉన్న అల్పపీడన ప్రాంతం ఈ రోజు వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పక్కనున్న దక్షిణ ఒడిస్సా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద కొనసాగుతుంది. ఈ అల్పపీడన ప్రాంతంకి అనుబందంగా ఉన్న అవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిమి ఎత్తు వరకు వ్యాపించి ఉంది.
ఈ ఆవర్తన నెమ్మదిగా పశ్చిమ -వాయువ్య దిశగా కదులుతూ రాగల 2 రోజుల్లో దక్షిణ ఒడిస్సా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి వెళ్లే అవకాశం ఉంది. ఈరోజు ఒక ఆవర్తనను దక్షిణ చత్తీస్గడ్ & పరిసర ప్రాంతాల్లో ఏర్పడి సగటు సముద్రమట్టం నుండి 2.1 కిమి ఎత్తు వరకు కొనసాగుతుంది. దీంతో ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు భారీ నుండి అతి భారీతో పాటు అత్యంత భారీ వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేపు, ఎల్లుండి భారీ వర్షములు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 30 నుండి 40కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.