కేటీఆర్ కి ఎప్పుడు వారిపైనే ప్రేమ.. సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

కేటీఆర్ కి డబ్బున్నోల్ల మీదనే ఎక్కువ ప్రేమనా..? పేద వారి మీద ప్రేమ ఉండదా..? అని టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్స్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. కేటీఆర్ అప్పుడు, ఇప్పుడు ఎప్పటికీ సినిమా వాళ్ల మీద ప్రేమ చూపిస్తున్నాడని సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sama Rammohan Reddy
Sama Rammohan Reddy

తాజాగా కేటీఆర్ అల్లు అర్జున్ అరెస్ట్ పై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబ పడే బాధ ఈ నాటికి ఒక్క మాట కూడా మాట్లాడలేని సన్నాసి కేటీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. కేటీఆర్ చరిత్రలో ఎక్కువగా పేదవారిపై, ఆడవారి మీద అహంకార ధోరణితో మాట్లాడాడని ఆరోపించారు సామ రామ్మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news