బ్రెయిన్‌ బంటి.. రోజుకో పార్టీ మారే చంటితో మనకు పోటీ లేదు : కేటీఆర్

-

పార్టీకి మారింది పేరు మాత్రమే డీఎన్‌ఏ కాదని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. మోదీ చేసిన గోల్‌మాల్‌ను దేశమంతటికీ వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌.. అని మహారాష్ట్ర రైతులు గర్జిస్తున్నారని తెలిపారు. మహారాష్ట్రలో అంటుకున్న అగ్గి దేశం మొత్తం అంటుకుంటుందని చెప్పారు.

సిరిసిల్లలో నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లికి పూలమాల వేసి ప్లీనరీని ప్రారంభించారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్​గా మారింది తప్ప అజెండా మారలేదని స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్​లు అధికారం కోసం అర్రులుచాస్తున్నాయని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

‘వ్యవసాయంపై 4.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టాం. ప్రజలు బీజేపీ, కాంగ్రెస్​ను కనుమరుగు చేసే రోజు త్వరలోనే వస్తుంది. బ్రెయిన్‌ బంటి.. రోజుకో పార్టీ మారే చంటితో మనకు పోటీ లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రావడం చారిత్రక అనివార్యత. గోల్‌మాల్‌ గుజరాత్‌ కాదు… గోల్డెన్‌ తెలంగాణ నమునానా దేశానికి పరిచయం చేసేందుకు బీఆర్ఎస్ ఆవిర్భవించింది.’ అని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news