IND VS AUS : రేపటి నుంచే ఇండియా-ఆసీస్ టికెట్ల విక్రయాలు

-

IND VS AUS : రేపటి నుంచే ఇండియా-ఆసీస్ టికెట్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 23న విశాఖపట్నంలోని ఏసీఏ-విడిసిఏ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించి రేపు, ఎల్లుండి టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. పేటీఎం ఇన్ సైడర్ ద్వారా టికెట్లు విక్రయించనున్నారు. ఈనెల 17, 18న విశాఖలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కౌంటర్లలో ఆఫ్లైన్ టికెట్లు ఇవ్వనున్నారు.

 Sale of India-Aussie tickets from tomorrow
Sale of India-Aussie tickets from tomorrow

రూ. 600, రూ. 1500, రూ. 2,000, రూ. 3,000, రూ. 3,500, రూ. 6,000 ధరల్లో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇది ఇలా ఉండగా.. క్రికెట్ అభిమానులకు ఐసీసీ శుభవార్త చెప్పింది. వరల్డ్ కప్ సెమీఫైనల్ ఫైనల్, మ్యాచ్ లకు రిజర్వ్డ్ కేటాయించినట్లు తెలిపింది. షెడ్యూల్ ప్రకారం మ్యాచులు జరగకపోతే మరుసటి రోజు రిజర్వ్డ్ డే ఉండనుందని పేర్కొంది. కాగా, తొలి సెమీఫైనల్ రేపు ఇండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతుంది. ఈనెల 17న జరిగే రెండో సెమీఫైనల్ లో దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా జట్టు తలపడనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా ఈ నెల 19న జరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news