10 నెలల్లో తెలంగాణ అప్పులు 80,500 కోట్లు – KTR

-

 

రేవంత్ కుర్చీ ఎక్కిన రోజు నుండి తెచ్చిన మొత్తం అప్పులు 80,500 కోట్లు అని… 10 నెలల్లో 80,500 కోట్ల రికార్డు అప్పులు తీసుకొచ్చాడని ఆగ్రహించారు కేటీఆర్‌. అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలి..? ఎన్నికల హమీలేవీ తీర్చలేదు..! ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టలేదని ఫైర్‌ అయ్యారు. మరి ముఖ్యమంత్రి తెస్తున్న అప్పు ఏమైనట్టు ? 80 వేల కోట్ల ధనం ఎవరి జేబులోకి వెళ్లినట్టు ?? అంటూ నిలదీశారు.

ktr revanth

బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా ? కమిషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా ?? అని ప్రశ్నించారు. అప్పు.. శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి…అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడటమేంటి ? అంటూ నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో.. అప్పులు తీసుకుని ప్రాజెక్టులు కట్టామన్నారు.
ప్రతిపైసాతో మౌలిక సదుపాయాలు పెంచాం….తీసుకున్న రుణంతో దశాబ్దాల కష్టాలు తీర్చామని తెలిపారు. కానీ.. ముఖ్యమంత్రి తెస్తున్న అప్పుల “అడ్రస్” ఎక్కడ ? అంటూ నిలదీశారు. రుణమాఫీ చేయకుండా..! రైతుభరోసా వేయకుండా..!!ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా..! నెలలపాటు జీతాలు ఇవ్వకుండా..!! ఇన్ని వేలకోట్లు ఏమైనట్టు ? ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు ?? అంటూ ప్రశ్నించారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version