పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గాంధీభవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు నాయకులు పార్టీలు మారడం సహజమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ ను వీడారు.. ఇప్పుడు మళ్లీ వస్తున్నారన్నాని.. ప్రజెంట్ పాలిటిక్స్ లో ఫిరాయింపులు కామన్ అని వ్యాఖ్యానించారు. నా దృష్టిలో పార్టీ ఫిరాయింపులు అసలు సీరియస్ మేటర్ కానే కాదని అన్నారు. ప్రజలు కూడా పార్టీ ఫిరాయింపులను సీరియస్గా తీసుకోవడం లేదని అన్నారు.
ప్రోటో కాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ నేతలు చేస్తోన్న వ్యాఖ్యలకు కూడా జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాలంలో తాను కూడా ప్రోటోకాల్ బాధితుడేనని గుర్తు చేశారు. సంగారెడ్డిలో నన్ను విపక్ష ఎమ్మెల్యేగా అవమానించారని.. అయినా పెద్ద మనసుతో నేను పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమంలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టేవారని. ఆ సమయంలో హరీస్ రావు, జిల్లా కలెక్టర్ పక్కనే ఉండేవారని తెలిపారు. అప్పుడు గుర్తుకు రానీ ప్రోటోకాల్ హరీష్ రావు, కేటీఆర్కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.