పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం సంతోషకరం: కేటీఆర్‌

-

పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో రాష్ట్ర పురపాలక శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే జీహెచ్‌ఎంసీలో వార్డుల పాలనకు నడుం బిగించింది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 150 వార్డులకు కార్యాలయాలను ఏర్పాటు చేసింది. ఇవాళ ఆ కార్యాలయాలను ప్రారంభించింది. హైదరాబాద్ కాచిగూడలోని వార్డు కార్యాలయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఒక్కో వార్డులో 10 మంది అధికారులు అందుబాటులో ఉండనున్నారు. పారిశుద్ధ్యం, విద్యుత్‌, టౌన్‌ప్లానింగ్‌ వంటి వాటిపై ఆ అధికారులకు ఫిర్యాదులు ఇవ్వొచ్చు.

పురపాలనలో మరో సంస్కరణకు శ్రీకారం చుట్టడం సంతోషకరమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వికేంద్రీకరణ, ప్రజలు కేంద్రంగా పాలనే తమ లక్ష్యం అని తెలిపారు. వార్డు కార్యాలయాల్లోనే కనీస పౌరసేవలు, ఫిర్యాదుల పరిష్కారం అవుతాయని వెల్లడించారు. సిటిజన్ చార్టర్‌కు అనుగుణంగా ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పారు. ప్రతి డివిజన్ కార్యాలయంలో 10 మంది అధికారుల బృందం అందుబాటులో ఉంటుందని.. సహాయక పుర కమిషనర్ నేతృత్వంలో సమస్యలు పరిష్కారం అవుతాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news