బావాబామ్మర్దుల దూకుడు..హ్యాట్రిక్‌కు గ్రౌండ్ వర్క్.!

-

వారిద్దరు బావాబామ్మర్దులు..చెరోవైపు ఉంటూ పార్టీని, రాష్ట్రాన్ని ముందుగా తీసుకెళుతున్నారు. వారిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని ప్రత్యర్ధులు చెబుతారు గాని..ఇద్దరు ఒకరిపై ఒకరు అభిమానంతో ఉంటారు. ఇద్దరు మంత్రులుగా ఉంటూ..రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే తమ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి కష్టపడుతున్నారు. అలా కష్టపడుతున్న బావాబామ్మర్దులు ఎవరో ఈ పాటికే అర్ధమైపోయి ఉంటుంది.

తెలంగాణ్ రాజకీయాల్లో కీ రోల్ పోషించే హరీష్ రావు, కేటీఆర్..గత 9 ఏళ్లుగా అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సి‌ఎం కే‌సి‌ఆర్‌కు రెండు భుజాలుగా ఉంటున్నారు. కే‌సి‌ఆర్ పై స్థాయిలో వ్యూహాలు అమలు చేస్తుంటే..వీరిద్దరు గ్రౌండ్ లెవెల్ లో అమలు చేస్తుంటారు. ఎవరికి ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తారు. ఇక గత 9 ఏళ్లుగా పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నా ఈ ఇద్దరికి ఈ సారి కాస్త పెద్ద పరీక్ష ఎదురుకానుంది. ఈ సారి పార్టీని గెలిపించడానికి ఎక్కువ కష్టపడాలి.

వాస్తవానికి ఈ ఇద్దరు నేతలు మంత్రులుగా మంచి పనితీరు కనబరుస్తున్నారు. అభివృధ్ది, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. రాజకీయంగా కూడా పార్టీకి మైలేజ్ పెంచడంలో వీరి కృషి వేరే స్థాయిలో ఉంది. తమ శాఖలకు సంబంధించి అద్భుతంగా పనిచేస్తూనే..తమ నియోజకవర్గాలని వదలకుండా అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. అయితే ఈ ఇద్దరి టార్గెట్ ఒక్కటే నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ బి‌ఆర్‌ఎస్ పార్టీని గెలిపించి హ్యాట్రిక్ సాధించడమే.

గత ఎన్నికల్లో ఈ ఇద్దరు కే‌సి‌ఆర్ వేసిన వ్యూహాలని గ్రౌండ్ లెవెల్ లో అమలు చేసి..ప్రత్యర్ధులకు చెక్ పెట్టేశారు. కానీ ఈ సారి కాస్త కష్టమయ్యే ఛాన్స్ ఉంది. అయినా సరే ఈ బావాబామ్మర్దులు వెనక్కి తిరిగే అవకాశం కనిపించడం లేదు. మళ్ళీ పార్టీ కోసం కష్టపడుతున్నారు. గ్రౌండ్ లెవెల్ లో పార్టీ బలం తగ్గకుండా చూసుకుంటున్నారు. చూడాలి మరి ఈ బావాబామ్మర్దులు మళ్ళీ పార్టీని గెలిపిస్తారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news