కర్ణాటక సీఎం వ్యాఖ్యలకు కేటీఆర్ మరో స్ట్రాంగ్ కౌంటర్..!

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డీ.కే. శివకుమార్ లపై మాజీ   సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ లు విమర్శలు చేశారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలను అస్త్రంగా కాంగ్రెస్ తీసుకొస్తే.. బీఆర్ఎస్ వాటిని విమర్శించింది. 24 గంటల కరెంట్ పై అయితే సీఎం కేసీఆర్ ప్రచారం చేసిన ప్రతీ చోటా ప్రస్తావించేవారు.

తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరో కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో మీ పార్టీ ఫేక్ హామీలతో ప్రజలను మోసం చేసినందుకే మేము ఎన్నికల్లో ఓడిపోయామని వెల్లడించారు. ముఖ్యంగా రూ.500 గ్యాస్ సిలిండర్, రూ.4000 పెన్షన్ హామీలను డిసెంబర్ 09న అమలు చేస్తామన్న మీ పార్టీ.. వాటిని అమలు చేయలేదు. మీ హామీలు బూటకమా.. మీ వాగ్దానాలు బూటకమా ? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ రెండు పార్టీల మధ్య చర్చకు దారి తీసింది. ఇరు పార్టీల నేతలు రీ ట్వీట్లతో మోత మోగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news