బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విషయంలో మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. బిజెపి అంజనీ కుమార్ తో ఫోన్ లో మాట్లాడిన ఆయన… ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్ అధికారితో వెరిఫై చేయించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశించారు. తన హత్యకు కుట్ర పన్నుతున్నారని ఈటల వాక్యానించగా… ఆయనకు భద్రత కల్పిస్తామని నిన్న కేటీఆర్ ప్రకటించారు. ఇక అటు బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రతకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు వై కేటగిరి భద్రత కల్పించే అవకాశం ఉంది.