రైతులు ఏమైనా దొంగలా, ఉగ్రవాదులా…కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు !

-

రైతులు ఏమైనా దొంగలా, ఉగ్రవాదులా అంటూ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన పాపానికి రాష్టవ్యాప్తంగా వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు కేటీఆర్‌. నిన్న రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టుచేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం దారుణమైన చర్య. వారేమైనా దొంగలా, ఉగ్రవాదులా..అని మండిపడ్డారు.

ktr on farmers arrest

ఇవాళ ఉదయం నుంచి కూడా అనేక చోట్ల అన్నదాతల ఇళ్లకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకుంటున్నట్టు సమాచారం అందుతోంది. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలన్నారు. పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అక్రమంగా నిర్బంధించిన రైతులందరినీ వెంటనే పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని చెప్పారు.

ముఖ్యమంత్రికి రైతులంటే ఇంత భయమెందుకు.. అన్నదాతలపై ఇంతటి నిర్బంధమెందుకు… అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీఇచ్చి మోసం చేసినందుకే రైతులు ఆందోళన పథం పట్టాడని ఆగ్రహించారు. ఏ రాజకీయపార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదు. రైతుల సంఘటిత శక్తి ముందు దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదని హెచ్చరించారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news