రంజిత్‌రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌కు వెళ్లారు: కేటీఆర్‌

-

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగిపోతున్న బీఆర్ఎస్ పార్టీ వరుస సమావేశాలతో బిజీబిజీగా గడుపుతోంది. తాజాగా తెలంగాణ భవన్లో చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, లక్ష్మారెడ్డి , మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై సమావేశంలో చర్చించారు.

ఈ నేపథ్యంలో కేటీఆర్ మాట్లాడుతూ రంజిత్‌ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌కు వెళ్లారని మండిపడ్డారు. పార్టీ కన్నా తానే పెద్ద అనే అహంకారం ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో గెలవరని వ్యాఖ్యానించారు. చేవెళ్లలో కాంగ్రెస్‌ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌లో తీవ్రమైన అయోమయంలో ఉందన్న కేటీఆర్.. చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ గెలవడం అసాధ్యమని తెలిపారు. చేవెళ్లలో ఏప్రిల్‌ 13వ తేదీన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ సభలో గులాబీ బాస్ కేసీఆర్‌ పాల్గొంటారని కేటీఆర్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news