RD-X మార్కులు చెరిపేసి KCR అని రాయండి అంటూ గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఇండ్లపై rdx మార్కులు చెరిపేసి కేసిఆర్ అని రాయాలని కోరారు. కెసిఆర్ అన్న పేరును తొలగించే దమ్ము ఎవరికీ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకవేళ కెసిఆర్ పేరును టచ్ చేస్తే… వాళ్ల అంతు చూస్తామని హెచ్చరించారు కేటీఆర్.
మూసిన్ పరివాహక ప్రాంతాలలో అక్రమంగా… బాధితులను తరలించడం దారుణం అన్నారు. కార్పొరేట్ వాళ్లకు మూసి పరివాహక ప్రాంతాన్ని అప్పగించేందుకే రేవంత్ రెడ్డి ఈ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇల్లు ఎఫ్డిఎల్ పరిధిలో… ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లును ఇంకా కూల్చలేదని మండిపడ్డారు.
తమ ప్రభుత్వం.. ఇండ్లను నిర్మించుకుంటూ వెళ్తే… రేవంత్ రెడ్డి మాత్రం కూల్చి వేసుకుంటూ వస్తున్నారని ఆగ్రహించారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదని కూడా తెలిపారు. మూసి బాధితులు అలాగే హైడ్రా బాదితులకు ఎలాంటి కష్టం వచ్చినా గులాబీ పార్టీ ముందు ఉంటుందని వెల్లడించారు.