రేవంత్ గనుల శాఖలో రూ. 150 కోట్ల అవినీతి ఘనులు ఉన్నాయని సంచలన పోస్ట్ పెట్టారు కేటీఆర్. ఫేక్ డాక్యుమెంట్లు, రసీదులు పుట్టించి తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి రూ. 150 కోట్ల విలువచేసే 1,50,000 టన్నుల ఇసుకను దోచేశారని ఆగ్రహించారు కేటీఆర్. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అవసరాల కోసం అంటూ తప్పుడు కాగితాలు సృష్టించి ఇసుకను ఇంటి దొంగలు…దారి మళ్లించారని బాంబ్ పేల్చారు కేటీఆర్.
సక్షాత్తూ రేవంత్ రెడ్డి శాఖలోనే జరిగిన ఈ కుంభకోణం, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరగదని పేర్కొన్నారు. వెంటనే ఈ ఇసుక దొంగలెవరో దర్యాప్తు జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానంటూ కేటీఆర్ పోస్ట్ పెట్టారు. దీంతో… రేవంత్ రెడ్డి గనుల శాఖలో నే రూ. 150 కోట్ల అవినీతి పై అందరూ చర్చించు కుంటున్నారు. మూసీ రివర్ డెవలప్మెంట్ లో సిఎం రేవం త్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నాడని కూడా కేటీఆర్ ఆగ్రహించారు కేటీఆర్.