పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు కేటీఆర్. సుప్రీం కోర్టు నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుందని పేర్కొన్నారు కేటీఆర్. తన పాంచ్ న్యాయ్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేను అనర్హులుగా పరిగణిస్తామని చెప్పిన రాహుల్ గాంధీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తారని ఆశిస్తున్నానన్నారు.

రాహుల్ గాంధీ మరియు ఆయన పార్టీ భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి స్పీకర్ పదవిని ఉపయోగించరని నేను ఆశిస్తున్నానని వెల్లడించారు. ఈ మూడు నెలల సమయంలో 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికల కోసం మేము మా పని మొదలుపెడతామని వార్నింగ్ ఇచ్చారు కేటీఆర్.