నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఎమ్మెల్యే గారి ఇంటిపైన ఇంటిపైన కాంగ్రెస్ గుండాలు దాడి చేసి విధ్వంసం చేసే ప్రయత్నం చేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సంఘటన తాలూకు వివరాలను సునీత లక్ష్మారెడ్డి గారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
దాడికి పాల్పడిన కాంగ్రెస్ గుండాలపైన పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారని తెలిపారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలతో సునీత లక్ష్మారెడ్డి లాంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలేమనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని వెల్లడించారు కేటీఆర్. ఎన్ని అరాచకాలకు పాల్పడిన 60 లక్షల మంది భారత రాష్ట్ర సమితి కుటుంబం ప్రజాప్రతినిధి నుంచి కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…ఎవరూ భయపడొద్దని కోరారు.