రజినీకాంత్ కూడా హైదరాబాద్ గురించి పొగుడుతున్నారు – మంత్రి కేటీఆర్

-

రజినీకాంత్ లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ గురించి పొగుడుతున్నారని… కానీ ఇక్కడ కొంత మంది మాత్రం ఇంకా కళ్లు తెరవడం లేదని చురకలు అంటించారు మంత్రి కేటీఆర్. అటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ర్యాంగింగ్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడే హుజూరాబాద్‌లో ఒక ఐటీ కంపెనీ ప్రారంభించామని గుర్తు చేసిన కేటీఆర్… ఆయన బీజేపీలోకి పోగానే అది బంద్ అయిందంటూ చురకలు అంటించారు.

తెలంగాణలో కులగజ్జి, మత పిచ్చి లేదు.. స్టేబుల్ గవర్నెన్స్ కేసీఆర్ నాయకత్వంలో ఉందని వివరించారు. బెంగుళూర్‌ను వెనక్కి నెట్టి ఐటీలో, ఉద్యోగ కల్పనలో తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందన్నారు. ప్రతిపక్షాలు కూడా ఐటీ అభివృద్ధిని అభినందించాల్సినదే.. 44 శాతం ఉత్పత్తి హైదరాబాద్ నుంచే అన్నారు. 1987లోనే ఇంటర్ గ్రాఫ్ పేరుతో ఐటీ ఏర్పడింది.. మేమే తెచ్చాం అని చెప్పుకునే వారు తెలుసుకోవాలి.. ఈటలకు కూడా తెలవాలని ఫైర్‌ అయ్యారు కేటీఆర్. ఈరోజు హైదరాబాద్‌లో ఎకరం 100 కోట్ల రూపాయలు పలుకుతుంది అంటే ఇక్కడ కేసీఆర్ నాయకత్వంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్లే సాధ్యమైందన్నారు మంత్రి కేటీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news