అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజయ్..కేటీఆర్ సెటైర్లు !

-

నిన్న మునుగోడు నియోజక వర్గంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్‌ సర్కార్‌పై అమిత్‌ షా తో సహా బీజేపీ నేతలందరూ మూకుమ్మడిగా దాడి చేశారు. అయితే.. అమిత్‌ షా టూర్‌ నేపథ్యంలోనే.. మరోసారి బండి సంజయ్‌ ట్రోలింగ్‌ కు గురయ్యారు.

ఉజ్జయిని మహాంకాళి టెంపుల్‌ దగ్గర అమిత్‌ షా బూట్లను బండి సంజయ్‌ పట్టుకున్నట్లు ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే.. దీనిపై మంత్రి కేటీఆర్‌ సెటైర్లు పేల్చారు. ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని – తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నదని చురకలు అంటించారు.

తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నదని…ట్వీట్‌ చేశారు మంత్రి కేటీఆర్‌. అయితే.. దీనిపై బండి సంజయ్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news