డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్..9 ఏళ్ల తర్వాత !

-

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ కి ఆడుతున్నప్పటి నుండి తెలుగు వారికి చాలా దగ్గరయ్యాడు. ఆటలో ఒంటిచేత్తో గెలిపిస్తూ సన్ రైజర్స్ టీమ్ ని విజయతీరాలకి చేర్చడమే కాకుండా, ఆట ముగిసిన తర్వాత తనదైన టిక్ టాక్ వీడియోలతో అలరిస్తూ ఉంటాడు. అయితే.. తాజాగా ఈ ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్..తన ఫ్యాన్స్‌ కు శుభవార్త చెప్పాడు. 9 ఏళ్ల తర్వాత బిగ్ బాష్ లీగ్ లో అడుగు పెట్టనున్నాడు వార్నర్‌.

ఈ మేరకు బిగ్ బాష్ లీగ్ 12 సీజన్ ముందు సిడ్ని థండర్ తో రెండు సంవత్సరాల ఒప్పందాన్ని వార్నర్ కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని సిడ్నీ తండర్ ఆదివారం సోషల్ మీడియాలో వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా తో టెస్ట్ సిరీస్ ముగిసిన అనంతరం వార్నర్ జట్టులో చేరనున్నాడని సిడ్ని థండర్ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇక ఇదే విషయంపై వార్నర్స్ స్పందిస్తూ నా బిగ్ బాష్ ఆరంభించిన జట్టులోకి మళ్ళీ తిరిగి రావడం నాకు సంతోషంగా ఉంది. నేను నా ఆటపట్ల పూర్తి అంకితభావంతో ఉంటాను. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ గా నా సీనియర్లు చూపిన మార్గం నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎల్లవేళలా ఆటను ఆస్వాదిస్తూ ఉంటా. అదేవిధంగా బిగ్ బాష్ నుంచి భవిష్యత్తు ఆటగాళ్లను తయారు చేయడంలో నా వంతు పాత్ర పోషిస్తాను అని పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news