KTR: బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులు..ఒక్క రూపాయి కట్టొద్దు

-

KTR: బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులు..ఒక్క రూపాయి కట్టొద్దు అంటూ ట్వీట్‌ చేశారు మాజీ మంత్రి కేటీఆర్‌. ఇప్పటికే రైతు బంధు రావడం లేదని రైతులు ఆందోళన చెందుతుంటే..బ్యాంక్‌ అధికారులు.. రైతులకు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు తీసుకున్న లోన్లు కట్టాలని రైతులకు లీగల్ నోటీసులు పంపుతున్నాయి బ్యాంకులు. దీంతో గందరగోళానికి లోనవుతున్నారు రైతులు.

అయితే.. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బ్యాంకుల్లో రుణాలున్న రైతులెవ్వరూ రూపాయి కట్టొద్దని కోరారు. డిసెంబర్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే డిసెంబర్ 9 నాడు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తాం….ఇప్పటివరకు లోన్‌ తీసుకోనోళ్లు పోయి తెచ్చుకోండి. తీసుకున్నోళ్లకు మా ప్రభుత్వం రుణమాఫీ చేశాక బ్యాంకోళ్లు మళ్లీ లోన్లు ఇస్తరు అని రేవంత్‌ రెడ్డి చెప్పినట్లు గుర్తు చేశారు కేటీఆర్‌. కానీ నేడు…పంట రుణాలపై కాంగ్రెస్‌ సర్కారు మౌనంగా ఉందని…. రైతన్నలకు లీగల్‌ నోటీసులు పంపిస్తోందని ఆగ్రహించారు. ఇంత మోసం, పచ్చి దగా, నయవంచన ఎక్కడా ఉండదని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news