125 అడుగుల అంబేద్కర్ విగ్రహం.. డిజైన్ అదుర్స్..!

హైదరాబాద్ లో 125 అడుగుల ఎత్తయిన అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు జీవో కూడా విడుదల చేసింది. ఈ భారీ విగ్రహాన్ని ఎన్టీఆర్ ఘాట్‌కు సమీపంలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనుకుంది. ఇందుకోసం ఎన్టీఆర్ గార్డెన్స్‌ ను ఆనుకొని ఉన్న 36 ఎకరాలను ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన ప్రణాళికను చాలా వేగంగా చేస్తుంది ప్రభుత్వం. అయితే తాజాగా.. అంబేద్కర్ విగ్రహ నమూనాను మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు.

అంబేద్కర్ విగ్రహానికి రూ.140 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హుస్సేన్‌సాగర్ సమీపంలో 11 ఎకరాల స్థలంలో అంబేద్కర్ పార్క్, అంబేద్కర్ విగ్రహంతో పాటు మ్యూజియం, లైబ్రరీ ఏర్పాటు చేస్తామని కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు.