హైదరాబాద్‌లో డేటా రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయాలి.. నిర్మలమ్మకు కేటీఆర్‌ లేఖ

-

హైదరాబాద్ మహానగరంలో అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. డేటా రాయబార కార్యాలయాలన్నీ ఒకే చోటుకాకుండా వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేయాలని కోరుతూ.. ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల కలిగే నష్టాలను లేఖలో ప్రస్తావించారు.

భూకంపాలు ఎక్కువ వచ్చే రాష్ట్రాల్లో గుజరాత్‌ ఉందని, అలాంటి ప్రాంతాల్లో డేటా ఎంబసీ కార్యాలయాలను ఏర్పాటు చేయడం వల్ల నష్టాలు కలుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. దేశంలోనే తక్కువ భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో హైదరాబాద్‌ ఒకటని, ఈ ప్రాంతం డేటా సెంటర్‌ ఏర్పాటుకు అనువైన ప్రదేశం అని తెలిపారు. గుజరాత్‌ సరిహద్దును మరో దేశంతో పంచుకుంటున్నందు డేటా సెంటర్ల భద్రతకు ప్రమాదకరమని, ఎంబసీ కేంద్రాల కోసం స్థలాన్ని ఎంపిక చేసే సమయంలో క్లయింట్ల భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. డేటా సెంటర్లకు హైదరాబాద్ ఆదర్శవంతమైన నగరమని, గ్లోబల్ డేటా సెంటర్ మేజర్లు తమ భారీ డేటా సెంటర్ల ఏర్పాటులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news