యాదాద్రి రోడ్డు షోలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

విపక్ష నేతలపై ఇవాళ విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. యాదాద్రి జిల్లాను చేసి అద్భుతంగా అభివృద్ధి చేసింది సీఎం కేసీఆర్ కాదా ? అని ప్రశ్నించారు. 55 ఏళ్ళ పాటు అధికారంలో ఉన్న చెత్త నా కొడుకులతో ఏం అభివృద్ధి జరిగింది అని కాంగ్రెస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భువనగిరిలో శేఖర్ రెడ్డిని గెలిపిస్తే.. మిగిలిపోయిన పనులు అన్నీ జరుపుకొని యాదాద్రిని సస్యశ్యామలంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా..? ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఎక్కడా.? కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య ఎక్కడా ? అంటూ కొందరూ వ్యక్తులు రోడ్డు షోలో ప్లకార్డులను ప్రదర్శించారు.

దీంతో ఆగ్రహానికి గురైన కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ సన్నాసులు అడుగుతున్నారు. 55 ఏళ్లు పరిపాలించినా చెత్త నా కొడుకులు ఏం పీకారు..ఇజ్జత్ మానం లేదు అడగడానికి..ఇవాళ వచ్చి ఇది లేకపాయే.. అది లేకపాయే అంటే వీపు పగులగొట్టే వాళ్లు లేకనా..? మీ యాదాద్రిని జిల్లా చేసింది ఎవరు? మరీ చెత్త నా కొడుకులకు అయిందా 55 ఏళ్లలా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. కరెంట్ ఇచ్చారా.. సాగునీళ్లు ఇచ్చారా.. తాగు నీళ్లు ఇచ్చారా..? కేసీఆర్ కిట్ ఇచ్చిర్రా.. డిగ్రీ కాలేజీ తెచ్చిర్రా.. వలిగొండలో ఇవి అడిగితే వీపు పగులగొట్టి పంపించాలే అని.. 30 తారికు నాడు ఎవ్వడొచ్చినా తొక్కుకుంటూ పోవుడేనని కేటీఆర్ తీవ్ర అసహనంతో మాట్లాడారు.