ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అధికారులు కొందరు రేపు కేంద్ర హోమ్ శాఖ తో చర్చకు కూర్చోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన చాలా విషయాలను ఈ మీటింగ్ లో చర్చలోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు కొన్ని కీలక విషయాలను తెలియచేశారు, ఏ అంశాలపై కేంద్ర హోమ్ శాఖను అడగాలి అన్న ఒక అవగాహనను కలిగించారు. విభజన హామీల గురించి మెయిన్ గా ఫోకస్ చేయమని అధికారులను జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈ విభజన హామీల వలన ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టం కలిగిందో వివరించాలని అధికారులకు సూచించారు జగన్. అలాగే తెలంగాణ నుండి రావలసిన విద్యుత్ బకాయిల గురించి కూడా అడగాలంటూ చెప్పారు సీఎం జగన్. ఇవి కాకుండా పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా లాంటి నిధుల గురించి అడగాలంటూ అవగాహన కల్పించారు సీఎం జగన్.
కాబట్టి వీటన్నింటిపై కేంద్రం మీద ఒత్తిడి తీసుకువచ్చి సాధించాలంటూ జగన్ చెప్పారు. మరి జగన్ చెప్పిన విధంగా అధికారులు కేంద్ర హోమ్ శాఖ తో మీటింగ్ లో మాట్లాడి మన బాధను తెలియచేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.