గుంపు మేస్త్రి అంటే కట్టేటోడు.. వీడు కూలగొట్టేటోడు చిట్టి నాయుడు – కేటీఆర్

-

గుంపు మేస్త్రి అంటే కట్టేటోడు.. వీడు కూలగొట్టేటోడు చిట్టి నాయుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరు వద్ద ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ముచ్చర్ల కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి చేసేది ఫోర్త్ సిటీ కాదని.. ఫోర్ బ్రదర్స్ సిటీ అన్నారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

లక్ష యాబై వేల కోట్లు మూసీకి ఖర్చు పెడుతున్నాడు. డబ్బు మూటలు ఢిల్లీకి పంపించేందుకు మూసీ సుందరీకరణ అంటున్నారని  కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవీని కాపాడుకునే పనిలో ఉన్నారు. పేదల ఇండ్లు కూల్చితే ఊరుకోమని హెచ్చరించారు. మీకు కూల్చాలనిపిస్తే.. మా ఇండ్లను కూల్చండి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక నిరుపేదల భూములను గుంజుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news