KTR sensational post on the development of Hyderabad: హైదరాబాద్ అభివృద్ధిపై కేటీఆర్ సంచలన పోస్ట్ పెట్టారు. SRDP ద్వారా హైదరాబాద్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కేసీఆర్ ప్రభుత్వం 42 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించింది వీటిలో 36 విజయవంతంగా పూర్తి చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మిగిలిన ప్రాజెక్టులను కూడా 2024లో పూర్తి చేయాల్సి ఉందని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కొనసాగుతున్న SRDP పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయని ఆగ్రహించారు. గత 8 నెలలుగా సరైన పర్యవేక్షణ లేక సకాలంలో చెల్లింపులు లేవని నిప్పులు చెరిగారు కేటీఆర్. SRDP మూడవ దశ ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ మేరకు ఫోటోలతో సహా పోస్టు పెట్టారు కేటీఆర్.
https://x.com/KTRBRS/status/1828262118409314459?t=H3QTVTexkXJM2O3Zy2YxGQ&s=08