డబల్ ఇంజన్ అంటే.. ఒక ఇంజన్ మోడీ, ఇంకో ఇంజన్ అదానీ – KTR

-

డబల్ ఇంజన్ అంటే.. ఒక ఇంజన్ మోడీ, ఇంకో ఇంజన్ అదానీ అంటూ ఫైర్‌ అయ్యారు KTR. కవితకు నోటీసులు ఇవ్వడంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. బీజేపీ ఈడీ, ఐటీ దాడులు చేయిస్తోంది.. దేశంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆగ్రహించారు మంత్రి కేటీఆర్.

బీజేపీ లో చేరితే వాషింగ్ పౌడర్ నిర్మాణా… అంటూ రెచ్చి పోయారు. సుజన చౌదరి కేసు, హిమంత బిస్వా శర్మ ల కేసు ఏమైందని నిలదీశారు. రెండు ఏర్పాట్లు ఉండాలని పాలసీ.. అది కాదని 6 పోర్ట్ లు అదానీ కి ఇస్తే అది స్కాం అన్నారు.

దేశంలో 8 ఏళ్లగా జుమ్లా.. లేకపోతే హమ్లా నడుస్తోంది. ప్రతిపక్ష నేతలపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలపై కేంద్ర సంస్థలతో దాడులు చేయిస్తున్నారు. మా నాయకులు 12 మందిపై ఈడీని, సీబీఐని పంపించారు. ఇవి ఈడీ సమన్లు కాదు.. మోదీ సమన్లు. ప్రతి పక్షాలపై కేసుల దాడి.. ప్రజలపై ధరల దాడి. గౌతం అదానీ ఎవరి బినామీ..? అదానీ.. మోదీ బినామీ అని చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు. ముంద్రా పోర్టులో రూ.21 వేల కోట్లు డ్రగ్స్‌ దొరికినా అదానీపై చర్యలు ఎందుకు లేవు? అని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version