రేవంత్ రెడ్డి ఓ చిచోరా సీఎం : కుట్ర

-

కేసీఆర్ మైనారిటీ పిల్లలకు గురుకులాలు ఏర్పాటు చేశారు. ఒక్కో విద్యార్థికి లక్షా 20 వేలు ఖర్చు పెట్టారు. పేద మైనారిటీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకువచ్చారు అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చాక ముస్లింలకు డిప్యూటీ సీఎం.. హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ ఇచ్చాము. హామీలను పక్కన పెట్టి మూసీ సుందరీకరణ పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపుతోంది.

మైనారిటీ కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది దాన్ని నిలబెట్టుకోవాలి. మైనారిటీ డిక్లరేషన్ పేరుతో మైనారిటీలకు 4000 కోట్లు కేటాయిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మైనారిటీ సబ్ ప్లాన్ చట్టం తెస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. యువ వికాసం పేరుతో పి.హెచ్.డి. పూర్తి చేసిన వారికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. పేదల ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కేసీఆర్ పాలనలో ఒక్క గంట హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ లేదు. ఇప్పుడు దసరా, దీపావళి పండుగల సమయంలో హైదరాబాద్ నగరంలో 144 సెక్షన్ పెట్టారు. రేవంత్ రెడ్డి ఓ చిచోరా సీఎం. కాబట్టి కేసీఆర్ తిరిగి సీఎం కావడానికి ముస్లిం మైనారిటీల మద్దతు ఉండాలి అని కేటీఆర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news