బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ది పాదయాత్ర నా..? లేక పదవుల యాత్రనా..? అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రేవంత్ దేవుళ్ల మీద ఒట్టేసి రైతులను నట్టేటా ముంచాడన్నారు. రూ.2లక్షల రుణమాఫీ, రూ.500 బోనస్ హామీ ఏమైంది..? అని ప్రశ్నించారు. 6 గ్యారెంటీలు కూడా అమలు చేయలేదన్నారు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కి ఓటమి తప్పదని తెలిపారు.
కాంగ్రెస్ కి బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కొనుగోలు కేంద్రాలు కూడా తెరవలేని దౌర్బాగ్య పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని మండిపడ్డారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వ్యవహార శైలి సరిగ్గా లేదన్నారు. కులగణన పకడ్బందిగా చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలన్నారు. కేటీఆర్ పాదయాత్ర హాస్యాస్పదం అన్నారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తే.. చీపుర్లు చెప్పులతో స్వాగతం పలకండన్నారు.