ఫ్రీ అంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు : కేటీఆర్

-

కర్ణాటకలో బస్సు టికెట్‌ ఛార్జీల్ని పెంచేందుకు కేఎస్‌ఆర్​టీసీ కసరత్తు చేస్తోంది. తమ సంస్థ మనుగడ సాగించాలంటే ప్రభుత్వ బస్సుల్లో ఛార్జీల పెంపు తప్పనిసరి అని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎస్‌ఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 15- 20శాతం మేర ఛార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కర్ణాటక బస్సు టికెట్ల పెంపు వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. ఏదైనా ఉచితంగా ఇస్తామంటున్నారంటే మరో ఆలోచనతో తీసుకెళ్తున్నట్లేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫ్రీ అంటున్నారంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గుర్తు పెట్టుకోవాలని తెలిపారు. బస్సు ఛార్జీల పెంపుపై కర్ణాటకను తెలంగాణ అనుసరించే రోజు మరెంతో దూరంలో లేదని కేటీఆర్ ట్వీట్ చేశారు.

ఇక కర్ణాటకలో ప్రస్తుతం ‘శక్తి’ పథకం కింద బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ ధరలు పెరిగితే పురుష ప్రయాణికులపై భారం పడతుందా అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మహిళ బస్సు ప్రయాణానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని అందువల్ల పురుషులపై భారం పడే అవకాశం ఉండదని అధికారులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news