రేవంత్ పాలనలో.. నేతన్నల కుటుంబాల్లో మరణమృదంగం : కేటీఆర్

-

చేనేత కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జాతీయ చేనేత దినోత్స శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాలపాటు దగాపడ్డ చేనేత రంగానికి… బీఆర్ఎస్ పదేళ్ల ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ స్వర్ణయుగమని అన్నారు. మగ్గానికి మంచిరోజులు తెచ్చిన దార్శనికుడు.. వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టిన పాలకుడు కేసీఆర్ అని కొనియాడారు. సమైక్యరాష్ట్రంలో ఆరేళ్ల బడ్జెట్ 600 కోట్లే.. బీఆర్ఎస్ పాలనలో ఏడాదికి 1200 కోట్లు అని తెలిపారు. కేసీఆర్ హయాంలోనే నేతన్నలకు గుర్తింపు, గౌరవం దక్కాయని వెల్లడించారు.

ఎన్నో విప్లవాత్మక పథకాలకు చిరునామా మన రాష్ట్రం అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారి 50 శాతం సబ్సిడీతో చేనేత మిత్ర , నేతన్నకు చేయూత పేరుతో త్రిఫ్ట్ ప్రత్యేక పొదుపు పథకం తీసుకొచ్చామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేనేత రంగంలో చిరునవ్వులు.. కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఛిద్రమవుతున్న బతుకులు అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ పాలనలో.. చేనేత రంగం మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. ప్రతినిత్యం చేనేత కార్మికుల కుటుంబాల్లో మరణమృదంగం మోగుతోందని వాపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news