తెలంగాణాలో పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై నిజనిర్ధారణ కమిటీ పోస్టుమార్టం చేస్తోంది. ఇవాళ రెండో రోజు కూడా నిజ నిర్ధారణ కమిటీ ఈ వ్యవహారంపై చర్చలు జరపనుంది. గాంధఈ భవన్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఓటమిపాలైన ఎంపీ అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులతో భేటీ కానుంది. పార్లమెంట్ నియోజక వర్గాలవారీగా భేటీ అయి.. అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పార్టీ నాయకులతో రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకోనున్నారు.
పార్టీ నాయకుల మధ్య సమన్వయం, నియోజకవర్గాల పరిధిలో మండల స్థాయి నాయకులు సహకారం అందిందా లేదా, పార్టీకి విధేయులుగా పని చేశారా లేదా, అన్న అంశాలపై ఈ కమిటీ సభ్యులు ఆరా తీయనున్నారు. అదే విధంగా బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న సాన్నిత్యంపై ఆరా తీస్తారు. నిన్న పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బరిలో నిలిచిన అభ్యర్థులతో, గెలుపొందిన ఎంపీలతో వేర్వేరుగా సమావేశమై వివరాలను తీసుకున్నారు. నాయకులు చెప్పిన అంశాలన్నిటిని కమిటీ సభ్యులు రాసుకున్నారు. గురువారం రాత్రి కురియన్ కమిటీ సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.