తెలంగాణ అసెంబ్లీలో BRSLPకి గదుల కేటాయింపు జరిగింది. రూమ్ నెంబర్ 1,2 లను BRSLPకి కేటాయించింది అసెంబ్లీ సచివాలయం. గతంలో ప్రతిపక్ష నేత గాజానా రెడ్డి, భట్టి విక్రమార్క లకు కేటాయించిన ఛాంబర్ ను BRS కు కేటాయించలేదు. ముఖ్యంగా అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ మార్చింది రేవంత్ ప్రభుత్వం.
ప్రతిపక్ష నేతకు ఏళ్ల తరబడి కేటాయిస్తున్న కార్యాలయం కాకుండా చిన్న రూంను కేటాయించారు. మొదటి ఆసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్‌కు గత ప్రతిపక్ష నేతలకు కేటాయించిన కార్యాలయాన్ని కేటాయించి రెండో సమావేశాల్లోపే మార్చింది కాంగ్రెస్ ప్రభు త్వం. అటు బిజెపి కి రూమ్ నెంబర్ 3 ,MIM కి రూమ్ నెంబర్ 4 కేటాయించారు. ఇక తెలంగాణ అసెంబ్లీలో BRSLP కి గదుల కేటాయింపు చేయడంపై అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ కు వచ్చారు BRS MLA లు, ఎమ్మెల్సీలు.