మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు గవర్నర్ తమిళిసై. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తున్నారు. కాళోజీ మాటలతో గవర్నర్ తమిళిసై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా తెలంగాణ ఇచ్చిన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అంటూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గవర్నర్ తమిళిసై.
తెలంగాణ ఏర్పాటులో కలిసివచ్చిన పార్టీలు, వ్యక్తులకు ఈ ప్రభుత్వం కృతజ్ఞతలు చెబుతోందని వివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన అప్పటి మన్మోహన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతోంది. ప్రత్యే కించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ పోషించిన చారిత్రక పాత్రను ప్రభుత్వం సర్మించుకుంటోందని వివరించారు తెలంగాణ గవర్నర్ తమిళిసై.
ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. యువకుల బలిదానాలతో ఏర్పాటైన తెలంగాణలో ప్రజాకాంక్షలు నెరవేరేలా ఈ ప్రభుత్వం పాలన సాగిస్తుందని తెలిపారు. ఈ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత పాటిస్తుందని చెప్పారు. ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్వాకాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేశామని తన ప్రసంగంలో గవర్నర్ పేర్కొన్నారు.