తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్.. మరోసారి పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు

-

తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ ఆర్టీసీ. మాటిమాటికి ఆర్టిసి బస్సు చార్జీలు పెంచుతున్న తెలంగాణ ఆర్టీసీ ఈసారి లగేజ్ చార్జీలు పెంచింది. ఆచార్జీలలో భారీగా పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త చార్జీలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది. ఇటీవల రెండు దఫాలుగా సెక్స్లు తదితరుల పేరుతో ప్రయాణికుల చార్జీలను పెంచిన ఆర్టీసీ తాజాగా లగేజ్ చార్జీలను గణనీయంగా పెంచింది.

లగేది చార్జీలు సుదీర్ఘంగా ఒకేలా ఉన్న అంశంపై ఇటీవల జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశంలో చర్చ జరిగిన నేపథ్యంలో వాటిని పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. 2002 తర్వాత ఈ చార్జీలను పెంచిన దాఖలాలు లేవు. డీజిల్ ధరలతో పాటు మానవ వనరుల వ్యయాలు పెరగడంతో వాటిని పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ కార్గో సేవలను ప్రోత్సహించేందుకు ఈ చార్జీలతో సమానంగా లగేజ్ చార్జింగ్ పెంచామని ఉత్తర్వుల్లో ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఇక చార్జీలు పెంచడంపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news