బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా.. అయితే మీకు ఈ ఆర్టికల్ కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఊబకాయాన్ని అదుపులో ఉంచేందుకు ఏం తినాలి, ఏం తినకూడదు అనే వాటిపై మనం ఈ సైట్ ద్వారా చాలా చెప్పుకున్నాం..అయితే మనం రోజూ వంటగదిలో చూసే ఉల్లిపాయ కూడా బరువు తగ్గిస్తుందట. ఉల్లిపాయ లేకుండా ఏ వంట చేయలేం..అలాంటి ఉల్లి వెయిట్ లాస్‌కు హెల్ప్ అవుతుందని నిపుణులు అంటున్నారు.. ఉల్లిని ఎలా వాడితే మరి రిజల్ట్ ఉంటుంది.. కరెక్టుగా ఉల్లిని వాడారంటే.. వారంరోజుల్లోనే మార్పు చూడొచ్చట..
ఫైబర్: ఉల్లిపాయ ఫైబర్ మంచి మూలం. 1 కప్పు ఉల్లిపాయలో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అందువల్ల రోజువారీ ఆహారంలో ఉల్లిపాయలను చేర్చుకోవడం చాలా మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉల్లిపాయలలో ఉండే కరిగే ఫైబర్ తినాలన్న కోరికలను తగ్గిస్తుంది. బరువు తగ్గించే ప్రయాణంలో అతిగా తినకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఉల్లిపాయలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 1 కప్పు తరిగిన ఉల్లిపాయలో 64 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఉల్లిపాయల్లో స్థూలకాయాన్ని నిరోధించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఉల్లిపాయ క్వెర్సెటిన్ సమ్మేళనంలో స్థూలకాయం నిరోధక లక్షణాలున్న ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది ఉశరీరానికి ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు.
ఉల్లిపాయలతో ఎలా వాడాలంటే..
ఉల్లిపాయ రసం: దీన్ని తయారు చేయడానికి, ఒక చిన్న ఒలిచిన ఉల్లిపాయతో 1 కప్పు నీటిని మరిగించండి…. మెత్తగా చేసుకోండి. చల్లారిన తర్వాత 1 కప్పు నీరు వేసి కలపండి. ఈ రసాన్ని ఒక గ్లాసులో పోసి తాగాలి.
ఉల్లిపాయ సూప్: గిన్నెలో 1 స్పూన్ నూనె, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి. 2 తరిగిన ఉల్లిపాయలు, 1/2 కప్పు కూరగాయలను జోడించండి. 2-5 నిమిషాలు తిప్పుతూ ఉడికించాలి. ఉప్పు, మిరియాలు, తగినన్ని నీళ్లు వేసి 20 నిమిషాలు ఉడికించండి.. చల్లారిన తర్వాత ఉల్లిపాయ సూప్ తాగండి.
వెనిగర్‌తో: ఉల్లిపాయను వేయించి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయను వెనిగర్ నీటిలో వేసి కాసేపు ఉంచండి.. వీటిని సలాడ్‌గా తీసుకోవచ్చు.
వీటి రుచి మీకు నచ్చకపోవచ్చు..కానీ ఫలితం మిమ్మల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుంది. ఓపిక ఉంటే ట్రే చేసి చూడండి.!
పైన పేర్కొన్న అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే..ఆరోగ్యపరమైన సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించగలరు.