ఈ స్టార్ హీరోయిన్స్ లో ఎవరు ఎక్కువ సినిమాలలో నటించారో తెలుసా..?

-

సినీ ఇండస్ట్రీలో ఆ కాలం హీరోయిన్లతో పోల్చుకుంటే ఈ కాలం హీరోయిన్స్ కి కొంచెం అవకాశాలు తక్కువే అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆనాటి కాలం హీరోయిన్లు ఏకంగా 200, 300 సినిమాలలో నటించి ప్రేక్షకులకు దగ్గర అవుతుంటే.. ఈ కాలంలో హీరోయిన్ లు కేవలం వందలోపు చిత్రాలకే పరిమితం అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇటీవల కాలంలో కొంతమంది స్టార్ హీరోయిన్లు ఏకంగా 70 చిత్రాలకు పైగా నటించి అందర్నీ ఆశ్చర్యాన్ని గురి చేశారు. మరి నయనతార, అనుష్క, త్రిష, తమన్నా, సమంత లాంటివారు ఇప్పటివరకు ఎన్ని సినిమాలలో నటించారో మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.

నయనతార:
లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ 2003లో మానస్సినక్కరే అనే మలయాళం సినిమా ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టింది. ఇక ఆ తరువాత వల్లభ, చంద్రముఖి వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమే లక్ష్మీ సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఎన్నో సినిమాలలో.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించి కమర్షియల్ సినిమాలలో కూడా మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి సరసన నటిస్తూ.. మరొకవైపు షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాతో పాటు మరో కొన్ని తమిళ్ సినిమాలలో నటిస్తోంది. ఇక తాజాగా తన 75వ చిత్రాన్ని నీలేష్ కృష్ణ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

త్రిష:
మొదట హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో తన సినీ కెరియర్ను మొదలుపెట్టిన ఈమె ప్రశాంత్ , సిమ్రాన్ జంటగా తెరకెక్కిన జోడి చిత్రం ద్వారా 1999లో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇక మౌనం పెసియాదే అనే తమిళ్ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. వర్షం సినిమా ద్వారా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అలా ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగు , తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కలుపుకొని మొత్తం 56 సినిమాలు చేసింది త్రిష. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో పొన్నియిన్ సెల్వన్ అనే సినిమాలో నటిస్తుండగా.. ఈ చిత్రం సెప్టెంబర్ 30 తేదీన విడుదల కానుంది. మరో మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది త్రిష.

తమన్నా:
చాంద్ షా రోషన్ చెహ్రా అనే హిందీ చిత్రం ద్వారా 2005లో తన కెరీర్ ను మొదలు పెట్టగా.. శ్రీ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది . ఇక తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించిన ఈమె తెలుగు, తమిళ్ ,హిందీ భాషల్లో కలుపుకొని 54 సినిమాలలో నటించింది. ఇక ప్రస్తుతం ఈమె చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నట్లు సమాచారం.

అనుష్క:
2005లో సూపర్ సినిమాతో తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. ఆ తర్వాత ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో చాలా అద్భుతంగా నటించింది. ఇక ఇప్పటివరకు తెలుగు , తమిళ్ కలుపుకొని మొత్తం 39 సినిమాలలో నటించింది. ఇక ప్రస్తుతం ఈమె చేతిలో కూడా రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం.

సమంత:
2010లో ఏ మాయ చేసావే సినిమా ద్వారా నటిగా తన కెరీర్ ను మొదలుపెట్టిన సమంత ఎన్నో చిత్రాలలో నటించి పలు వెబ్ సిరీస్, పాన్ ఇండియా చిత్రాల ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే 40 సినిమాల వరకు పూర్తి చేసిన ఈమె. ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తోంది. ఇది ఈమెకు 41 వ చిత్రం కావడం గమనార్హం. ఈ సినిమా తర్వాత మరో రెండు మూడు ప్రాజెక్టులు ఈమె చేతిలో ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news