మహబూబ్ నగర్ మాదిగోల్ల జిల్లా.. గట్టిగా డప్పులు కొట్టండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన రైతు ఉత్సవాల ముగింపు బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా..? అని ప్రశ్నించారు. కుట పూరితంగానే లగచర్లలో అధికారులపై దాడులు చేయాల్సి వస్తే.. శ్రీశైలం, నాగార్జున సాగర్ కట్టేవాళ్లమా..? అని అడిగారు.
సరిగ్గా 70 సంవత్సరాల తరువాత బూర్గుల తరువాత రైతు బిడ్డ మీ అభిమానంతో తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చింది. నా జన్మ ధన్యం అయిందని తెలిపారు. అనవసర ఖర్చుల కోసమో.. కాదు. పాలమూరు వాళ్లకు పని చేయడమే తెలుసు. గొప్పలు చెప్పుకోరు. రైతులే మా బ్రాండ్ అంబాసిడర్లు అన్నారు. తాను పుట్టింది.. పెరిగింది నల్లమల్ల అడవుల్లో.. పులులు చూశా.. అడవిలో ఉండే మృగాలను చూశా. అన్నింటినీ ఎదుర్కొని ఇంత దూరం వచ్చా. మానవ మృగాలు మీరెంత..? నా కాలు గోటితో సమానం అన్నారు.