నేడు ఐటీ అధికారుల ఎదుట హాజరు కానున్న మల్లా రెడ్డి.

ఈ రోజు ఐటీ అధికారుల ఎదుట హాజరు కానున్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లా రెడ్డి. మంత్రి మల్లారెడ్డి తో పాటు 16 మంది కి నోటీసులు జారీ చేసింది ఐటీ. ఈ రోజు ఐటీ అధికారుల ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొంది ఐటీ శాఖ.

రెండు రోజులు పాటు మంత్రి మల్లా రెడ్డి తో పాటు కుటుంబ సభ్యుల ఇళ్ళు, కాలేజీలలో కొనసాగాయి ఐటీ సోదాలు. మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో లభ్యమైన 3 కోట్ల నగదు, కీలక పత్రాలు లభ్యం అయ్యాయి. ఇక ఈ సోదాల్లో 18కోట్ల 50 లక్షల నగదు ,15 కిలోల బంగారం, కీలక పత్రాలను సీజ్ చేశారు అధికారులు. ఈ నేపథ్యంలోనే.. మంత్రి మల్లారెడ్డి తో పాటు 16 మంది కి నోటీసులు జారీ చేసింది ఐటీ.