పవన్ కళ్యాణ్ సినిమా లో విలన్ గా మంత్రి మల్లారెడ్డి..వీడియో వైరల్

-

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామిర్ పేట్ మండలం అలియాబాద్ లో శనివారం ఇంచార్జి పల్లా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు చేసింది ఏమీ లేదని, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపడ్డారు.

దేశంలోనే కేసీఆర్ గొప్ప సీఎం అని, తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అన్నారు. రాష్ట్రాభివృద్ధిని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ ను దేశ ప్రజలంతా దేశ రాజకీయాలకు నాయకత్వం వహించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయస్థాయిలో స్థాపించిన టిఆర్ఎస్ పార్టీని చూసి ప్రధాని మోదీకి వణుకు పుడుతున్నదని చెప్పారు. అలాగే.. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి. నన్ను పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో విలన్‌ గా చేయాలని దర్శకుడు హరీష్‌ శంకర్‌..కోరారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news