ఆస్ట్రేలియాలో బిడ్డ మృతి… తెలంగాణా తల్లి తండ్రుల కీలక నిర్ణయం

-

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి స్థిరపడాలి అనుకున్న పిల్లల కోసం ఇక్కడ ఉన్న తల్లి తండ్రులు ఎంతో ఆశగా చూస్తూ ఉంటారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఇలా పలు దేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుతూ ఉంటారు. ఉద్యోగాల కోసం వెళ్లి అక్కడ స్థిరపడే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ తరుణంలో ప్రమాదాలు పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. తాజాగా ఒక ఘటన జరిగింది.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మల్లెపల్లి రక్షిత(20), బీటెక్ విద్యార్థిని ప్రమాదానికి గురైంది. డిసెంబర్ 31వ తేదీన ఉదయం స్కూటీపై వెల్తుండగా ప్రమాదం జరిగింది. బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ తరుణంలో తల్లి తండ్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు తల్లిదండ్రులు. మల్లెపల్లి వెంకట్ రెడ్డి, అనితల కూతురు రక్షిత.

మల్లెపల్లి వెంకట్ రెడ్డి మాజీ సైనిక ఉద్యోగి అని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం డిఆర్డీఓలో పని చేస్తున్నారు అని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని మీర్ పెట వద్ద నివాసముంటున్నారని, గత సంవత్సరం నవంబర్ 19వ తేదీన ఆమె వెళ్ళింది. వంగూరు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడిందని పేర్కొన్నారు. ఆమె మృతదేహాన్ని భారత్ కి తీసుకొస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news