క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు 25 కోట్లకు టోకరా.. 300 మందికి పైగా బాధితులు..!

-

నంద్యాల జిల్లా డోన్ లో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు 25 కోట్లు వసూలు చేసాడు రామాంజనేయులు అనే మోసగాడు.. బైనాన్స్, ఒకే-ఎక్స్ యాప్స్ లో ట్రేడింగ్ చేస్తూ, లక్ష పెట్టుబడికి నెలకు పదివేలు ఇస్తామంటూ నమ్మించాడు కేటుగాడు. అయితే కర్నూలు, నంద్యాల, మహబూబ్ నగర్ జిల్లాల్లో మొత్తం 300 మందికి పైగా బాధితులు ఉన్నట్టు సమాచారం. అయితే ఈ మోసగాన్ని 45 రోజులుగా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

కానీ గత 45 రోజులుగా కేసు నమోదు చేయకుండా, కాలయాపన చేస్తున్న పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడిని పట్టుకొని 45 రోజులైనా న్యాయం జరగక పోవడంతో లబోదిబోమంటున్నారు బాధితులు. డోన్ లో 2021 నుండి కేవ ఇండస్ట్రీస్ ఆర్గానిక్ హెర్బల్ కంపెనీ పేరుతో ప్రజలకు పరిచయం అయ్యాడు కేటుగాడు. గతంలో అనంతపురంలో 90 లక్షలు మోసం చేసినట్టు రామాంజనేయులు పై అభియోగాలు ఉన్నాయి. అయితే మోసగాడు అనంతపురం జిల్లా పెద్దవడుగురు వాసిగా గుర్తించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news